పొన్నూరులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

పొన్నూరులో రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమం

GNTR: పొన్నూరులోని 27వ వార్డులో రంజాన్ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర 325 మంది నిరుపేద కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. రంజాన్ మాసం శాంతి, సహనానికి ప్రతీక అని, పేదలకు అండగా నిలవడం మనందరి బాధ్యత అని అన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ నేత హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.