కొత్తవలసలో అన్నా క్యాంటీన్ పనులు ప్రారంభం

VZM: కొత్తవలస కూడలిలో అన్నా క్యాంటీన్ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. పేదవాళ్ళ ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోనీ అన్ని నియోజకవర్గాలలో అన్నా క్యాంటీన్‌లకు శ్రీకారం చుట్టారు. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి ప్రత్యేక చొరవ తీసుకొని కొత్తవలస కూడలిలో అన్నా క్యాంటీన్‌కు ఏర్పాటుకు ఆగస్టు 14న కూటమి నాయకులతో కలసి భూమి పూజ చేశారు.