రైల్వే కోడూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

రైల్వే కోడూరులో గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంలోని సురపు రాజుపల్లి దారిలోని శనివారం ఉదయం ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. ఇందులో భాగంగా గుంజన నదిలో గుర్తు తెలియని వ్యక్తి జారిపడి మరణించినట్లు సమాచారం. స్థానికులు నదిలో మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.