జనగణన–2027పై అధికారులకు శిక్షణ
MLG: దేశాభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుకు జనాభా గణన–2027 కీలకమని అధికారులు తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్‌లో సంబంధిత అధికారులకు రెండో రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్ సెన్సస్ ఆపరేషన్స్ కార్యాలయానికి చెందిన అధికారులు హోబాలాల్, సరళ గణన ప్రక్రియపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవోలు తహసీల్దారులు పాల్గొన్నారు.