'పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి'

ADB: భీంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పలు గ్రామాల్లో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలోని ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. వర్షాకాలం నేపథ్యంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల వైద్యాధికారి డా. నిఖిల్ రాజ్ సూచించారు. మంచినీటిలో లార్వాల నిర్మూలనకు థిమోఫాస్ 50% రసాయనాలను పిచికారీ చేసినట్లు తెలిపారు.