గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ర్యాండమేజేషన్ పూర్తి :కలెక్టర్
JGL: జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు ర్యాండమైజేషన్ విధానంలో ఎన్నికల సిబ్బంది కేటాయింపు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఈ ప్రక్రియ నిర్వహించారు. అనంతరం ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష చేపట్టారు. పోలింగ్ సెంటర్లకు 1406 పీవోలు, 2005 ఇతర పోలింగ్ అధికారులను కేటాయించినట్లు తెలిపారు.