పిల్లలమర్రిలో వైభవంగా వసంత పంచమి వేడుకలు
SRPT: చారిత్రాత్మక పిల్లలమర్రి శివాలయంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సరస్వతి అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు, నూతన వస్త్రాలంకరణ నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీచక్ర దేవతకు కుంకుమ పూజలు చేశారు. దివ్య అలంకరణలో కొలువుదీరిన చదువుల తల్లిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తడంతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మికతతో విరాజిల్లాయి.