'ఎస్సీ యువతకు భారీ సబ్సిడీ రుణాలు'
MBNR: జిల్లాలో నిరుద్యోగ ఎస్సీ యువత స్వయం ఉపాధి కోసం రూ.1- 7 లక్షల వరకు రుణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సునీత తెలిపారు. దీనిపై 50% నుంచి 90% వరకు సబ్సిడీ ఉంటుందని వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 21-50 ఉండాలని, మార్చి 24లోపు TGOBMMS పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 9849905996ను సంప్రదించవచ్చన్నారు.