అప్పుల బాధతో యువ రైతు మృతి

వరంగల్: అప్పుల బాధతో యువ రైతు మృతి చెందిన ఘటన గీసుకొండ మండలంలో మంగళవారం జరిగింది. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాలు..ఆరెపల్లి గ్రామానికి చెందిన గువ్వాడి మోహన్‌రావు(32) తనకున్న 3 ఎకరాల వ్యవసాయ భూమిలో పంట సాగు చేశాడు. ఈ క్రమంలో రూ.3లక్షల మేర అప్పు చేశాడు. అప్పు తీర్చే పరిస్థితి లేకపోవడంతో తాగుడుకు బానిసై మనస్తాపంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు.