పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకా ప్రారంభం

పీహెచ్‌సీలో హెచ్‌పీవీ టీకా ప్రారంభం

PPM: తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్‌పీవీ టీకా కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ప్రారంభించారు. 14–15 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ కోసం ఈ టీకా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ టీకాను బాలికలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.