పాఠశాలలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
SRCL: రాజ్యాంగం ద్వారానే దేశ పురోగతికి మార్గ నిర్దేశం చేయబడిందని వేములవాడ న్యూ అర్బన్ కాలనీ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విక్కుర్తి లక్ష్మీనారాయణ అన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పాఠశాల ఆవరణలో భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి రాజ్యాంగంపై ప్రతిజ్ఞ చేశారు.