'అబద్ధాల ప్రచారమే మీడియా స్వేచ్ఛా..?'
BPT: మీడియా స్వేచ్ఛ ముసుగులో వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులపై, ముఖ్యంగా ఆడవాళ్లపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్యం అనిపించుకోదని అద్దంకి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి, ఒక పార్టీకి తొత్తుగా మారి వ్యక్తిత్వ హననానికి పాల్పడటం దురదృష్టకరమని అన్నారు.