VIDEO: 'ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు'
SKLM: ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. సోమవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని, జిల్లా నలుమూల నుంచి వచ్చిన ప్రజల నుంచి పలు వినతులు స్వీకరించారు. వినతులను పరిశీలించి వేగంగా పరిష్కరించాలన్నారు.