ఆసుపత్రి వైద్యురాలి బాధ్యతల స్వీకరణ

SKLM: ఎల్.ఎన్. పేట మండలం తురకపేట ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో డాక్టర్ వసుధ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఇక్కడ పనిచేసిన ఇద్దరు డాక్టర్లు కొన్ని రోజుల కిందట ఉన్నత చదువుల కోసం వెళ్లిపోయారు. శ్రీకాకుళం అర్బన్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న తాను వారి స్థానంలో బదిలీపై వచ్చినట్లు వసుధ తెలిపారు. ఆమెకు వైద్య సిబ్బంది అభినందనలు తెలిపారు.