రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
చిత్తూరు: రెండు బైకులు ఢీకొన్న ఘటన కుప్పం - పలమనేరు జాతీయ రహదారిలోని బడుగుమాకుల పల్లి వద్ద చోటుచేకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. శాంతిపురం (M) ముల్లూరు కృష్ణాపురానికి చెందిన చేపల వ్యాపారులు సూపర్ ఎక్సెల్ వాహనంపై గ్రామానికి వెళ్తుండగా, ఎదురుగా రాజుపేట రోడ్డు వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు.