గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

NLG: నల్లగొండ వన్‌టౌన్ పోలీసులు మంగళవారం గణేష్ నగర్ కాలనీ శ్మశానవాటిక సమీపంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వారి నుంచి 2 కిలోల గంజాయి, రెండు బైక్లు, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.