జిల్లాలో వర్షపాతం వివరాలు

ELR: జిల్లాలో గడచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం నమోదు వివరాలను వాతావరణ శాఖ అధికారులు సోమవారం వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా దెందులూరు మండలంలో 53.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యల్పంగా పెదపాడు మండలంలో 1.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందన్నారు. జిల్లాలో 28 మండలాలకు గాను 19 మండలాల్లో వర్షం కురవలేదన్నారు.