బస్సును ఢీ కొట్టిన కారు తప్పిన ప్రమాదం

బస్సును ఢీ కొట్టిన కారు తప్పిన ప్రమాదం

NLR: కొడవలూరు మండలం రాజుపాలెం సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఎక్కుతున్న ఆర్టీసీ బస్సును తాడేపల్లిగూడెం నుంచి తిరుపతికి వెళ్తున్న కారు వెనకవైపు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం దెబ్బతినగా, బస్సు వెనక భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి గాయాలు కాలేదు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.