'అంబేద్కర్ విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలి'
NRML: నిర్మల్ పట్టణంలోని అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద సుందరీకరణ పనులు చేపట్టాలని మాదిగల అంబేద్కర్ సంఘ నాయకులు కోరారు. ఇందులో భాగంగా వారు మున్సిపల్ వైస్ ఛైర్మన్ గణేష్ చక్రవర్తికి నేడు వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ విగ్రహం చుట్టూ గ్రీనరీ, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని విన్నవించారు. అదేవిధంగా విగ్రహం వద్ద వాహనాల నిలిపివేతకు చర్యలు తీసుకోవాలన్నారు.