గ్యాస్ సంక్షోభం.. భారత్‌కు మిత్రదేశం శుభవార్త
గ్యాస్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారత్‌కు మిత్ర దేశమైన అర్జెంటీనా శుభవార్త చెప్పింది. భారత్‌కు గ్యాస్ సరఫరా చేసేందుకు ముందుకు వచ్చింది. తమ వద్ద అపారమైన గ్యాస్ నిల్వలు ఉన్నాయని.. భారత్‌కు దీర్ఘకాలం గ్యాస్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు అర్జెంటీనా రాయబారి మారియానో ప్రకటించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే అర్జెంటీనా నుంచి 50 వేల టన్నుల ఎల్పీజీ దిగుమతి అయింది.