ఇకపై బస్సులో బాత్రూమ్

ఇకపై బస్సులో బాత్రూమ్

ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థ 'ఇంటర్ సిటీ' కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రయాణాల సమయంలో తమ బస్సుల్లో బాత్రూమ్ సౌకర్యాన్ని ప్రారంభించింది. డ్రైవర్ సీటు వెనుక భాగంలో బాత్రూమ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సదుపాయం మూత్ర విసర్జన కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. ఈ సౌకర్యంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు ఉపశమనం కలగనుంది.