VIDEO: నల్లబెల్లి మండలంలో ప్రమాదకర మలుపు
WGL: నల్లబెల్లి మండలం కొండైలుపల్లె-రాంనగర్ మధ్య రోడ్డులోని మలుపు ప్రమాదాలకు కేంద్రంగా మారింది. చెట్ల కొమ్మలు అడ్డంగా పెరిగి ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడం, హెచ్చరిక బోర్డులు లేకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. చెట్ల కొమ్మలు తొలగించి, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు.