జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య

జీవితంపై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య

WGL: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాయపర్తి మండలం కాట్రపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం కాట్రపల్లి చెందిన బూడిద రాజు(34)తనకు పెళ్ళి సంబంధాలు కుదరడం లేదని తనకంటే చిన్నవారికి వివాహాలు జరగుతుండడంతో గత కొంతకాలంగా తీవ్ర మానసిక క్షోభకు గురిఅవుతున్నాడు. నేడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.