పదోతరగతి విద్యార్థి మృతి

SKLM: పదోతరగతి ఫలితాల్లో మార్కులు తక్కువగా వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాకుళం నగరంలోని బలగ ప్రాంతానికి చెందిన గురుగుబిల్లి వేణుగోపాలరావు బుధవారం విడుదలైన పరీక్షా ఫలితాల్లో 393 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువ వచ్చాయని తీవ్ర మనస్థాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.