అనుమతులు పొందిన మైనింగ్ ప్రాంతాల పరిశీలన
NLR: వరికుంటపాడు మండలంలో అనుమతులు పొందిన మైనింగ్ ప్రాంతాలను జిల్లా మైనింగ్ ఏడీ శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. వేంపాడు, రామాపురం, జడదేవి గ్రామాల్లో ఉన్న మైనింగ్ ప్రదేశాల్లో పనులు ఆగిపోవడానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైన వారికి పర్మిట్లు ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనింగ్ సూపర్‌వైజర్ సుధాకర్, వీఆర్‌వోలు ఆంటోనిబాబు తదితరులు పాల్గొన్నారు.