కురుపాం ఘటన.. కేజీహెచ్‌లో NHRC విచారణ
VSP: కురుపాం గురుకులంలో జాండిస్ బారిన పడి బాలికలు మృతి చెందిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) బృందం గురువారం సాయంత్రం KGHలో విచారణ చేపట్టింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించింది. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ వైద్య సేవల వివరాలు, పరీక్షల నివేదికలు, తీసుకున్న జాగ్రత్తలు బృందానికి వివరించారు.