శ్రీశైల మహాక్షేత్రంలో ఉచితంగా లడ్డూలు
KRNL: శ్రీశైల మహాక్షేత్రంలో దర్శనానికి వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదాలు ఇవ్వాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. బుధవారం ధర్మకర్తల మండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు ఆధ్వర్యంలో ఈవో ఎం.శ్రీనివాసరావు, ధర్మకర్తలు సమావేశమై ఈనిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 1 నుంచి రూ. 500 టికెట్‌కి 100గ్రా రెండు లడ్డూలు, రూ. 300 టికెట్‌కి ఒక లడ్డూ ఉచితంగా ఇవ్వనున్నారు.