బరిలో పోటీ చేసేదెవరో తేలిపోయింది!
KMR: జిల్లాలోని 532 గ్రామ పంచాయతీలకు సర్పంచ్ స్థానాలకు, 4656 వార్డు స్థానాలకు రిజర్వేషన్లను కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదివారం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా విడుదల చేశారు. కోర్టు ఆదేశాల మేరకు, మొత్తం రిజర్వేషన్లు 50 శాతం మించకుండా ఈ స్థానాలను ఖరారు చేయడం జరిగింది. దీనితో ఎవరు ఎక్కడ పోటీ చేయాలో స్పష్టత వచ్చింది.