మేడ్చల్లో HPV వ్యాక్సిన్.. 47 వేల మంది గుర్తింపు

మేడ్చల్లో HPV వ్యాక్సిన్.. 47 వేల మంది గుర్తింపు

MDCL: మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలలో చదువుతున్న సుమారు 47 వేల మంది బాలికలను వైద్య ఆరోగ్యశాఖ గుర్తించింది. సర్వైకల్ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా మూడు నెలల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, హెచ్‌పీవీ వైరస్‌కు వ్యతిరేకంగా టీకాలు అందించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్య రక్షణకు పెద్దపీట వేయనున్నారు.