అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి

ADB: బోథ్ మండలం పట్నాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కుంరం గంగాదర్ అనారోగ్యంతో ఇవాళ తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన మృతి పట్ల గ్రామస్థులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సర్పంచ్‌గా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన మరణం గ్రామ అభివృద్ధికి తీరని లోటని గ్రామస్థులు అన్నారు.