మోడల్ స్కూల్లో జనగణన శిక్షణ కార్యక్రమం
KNR: 2026-27 జనగణన కార్యక్రమ శిక్షణ శంకరపట్నం మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం నిర్వహించారు. మొదటి బ్యాచ్గా నిర్వహించిన ఈ శిక్షణలో మొత్తం 45 మంది పాల్గొన్నారు. ఇందులో 36 మంది ఎన్యూమరేటర్లు, 7 మంది సూపర్వైజర్లు, ఇద్దరు ట్రైనర్లు ఉన్నారు. ఈ కార్యక్రమానికి మండల తహసీల్దార్ సురేఖ, అదనపు జిల్లా గణాంక అధికారి కిషన్ రావు, జిల్లా ఇంఛార్జ్ గణాంక అధికారి ఉన్నారు.