లెబనాన్‌పై దాడులు.. 20 మంది మృతి
లెబనాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. తాజాగా హిజ్‌బుల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. మరో 57 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. లెబనాన్‌పై IDF చేసిన దాడుల్లో ఇప్పటివరకు మృతి చెందిన వారి సంఖ్య 1021కి చేరింది.