'యుద్ధప్రాతిపదికన చేతిపంపులు మరమ్మతులు చేయాలి'
విజయనగరం జిల్లాలో రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రజలకు తాగునీటి ఎద్దడి కలగకుండా ముందస్తు జాగ్రత్తగా 45 రోజుల పాటు ‘సమ్మర్ క్రాష్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్ రామ సుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఫిభ్రవరి 1 నుంచి ప్రారంభం కానున్న ప్రత్యేక డ్రైవ్ ద్వారా జిల్లాలోని అన్ని ఆవాస ప్రాంతాల్లోని చేతిపంపులు మరమ్మతులు చేయాలని ఆదేశించారు.