నగరంలో కొమ్మెర్ల అనిల్ కుమార్ సంస్మరణ సభ

GNTR: చుండూరు దళిత పల్లె వీరుడు కొమ్మెర అనిల్ కుమార్ స్మారక సభ, దళిత పల్లెవీరుల అవార్డుల ప్రదానోత్సవం అరండల్ పేటలోని SC, ST రైల్వే ఎంప్లాయిస్ యూనియన్ హాల్‌లో మంగళవారం జరిగింది. దళిత బహుజన ఫ్రంట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా దళిత సంఘాల నాయకులు అనిల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.