'క్యూలో ఉన్న వారందరికీ ఓటుకు అవకాశం కల్పించాలి'

'క్యూలో ఉన్న వారందరికీ ఓటుకు అవకాశం కల్పించాలి'

SRPT: మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికీ టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని కలెక్టర్ తేజస్ ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. బుధవారం మఠంపల్లి మండలంలోని వర్ధాపురం జడ్పీ హైస్కూల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మధ్యాహ్నం 12 గంటలకే 85 శాతం పోలింగ్ పూర్తయిందని ఆర్వో స్వామి కలెక్టర్‌కు వివరించారు.