వరకట్న వేధింపులు.. నటుడిపై కేసు

నటుడు ధర్మ మహేశ్‌పై కేసు నమోదు అయ్యింది. అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్నారంటూ మహేష్, అతడి కుటుంబ సభ్యులపై అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. గచ్చిబౌలి పీఎస్‌లో వారిపై కేసు నమోదైంది. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా 'సిందూరం' (2023), 'డ్రింకర్ సాయి' చిత్రాల్లో మహేష్ నటించాడు.