'మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి'

'మహిళలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలి'

WGL: నర్సంపేట BRS పార్టీ కార్యాలయంలో ఈరోజు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి మహిళకు చీరలు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించి ప్రతి మహిళకు చీరే అందించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.