గంజాయి స్వాధీనం.. ఇద్దరి అరెస్ట్

SKLM: నరసన్నపేటలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరిని అరెస్టు చేశామని సీఐ ఎం.శ్రీనివాసరావు, ఎస్సై సిహెచ్.దుర్గాప్రసాద్ తెలిపారు. గురువారం నరసన్నపేట మడపాం టోల్ గేట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అజయ్ కుమార్, దేవేంద్ర ప్రధాన్ అనే వ్యక్తులు వద్ద 18 కేజీల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.