జిల్లా కలెక్టర్‌కు కితాబు ఇచ్చిన సీఎం
PPM: జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డిని సీఎం చంద్రబాబు మరోసారి ప్రశంసించారు. అమరావతిలో గురువారం జరుగుతున్న రెండవ రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడుతూ.. ముస్తాబు కార్యక్రమం నన్ను చాలా ఆకర్షించిందన్నారు. విద్యార్థులే స్వయంగా బాగుందని చెప్పే పరిస్థితి ఏర్పడిందని, వినూత్న ఆలోచనతో నిధులు లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చెయ్యొచ్చని అన్నారు.