'ఆధార్ ఇంటిగ్రేటెడ్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలి'
ADB: జిల్లాలో ఆధార్ సవరణకు సంబంధించి ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ క్యాంపులను విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు మండలాలకు చెందిన అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కార్యక్రమంలో RDO స్రవంతి, DPO రమేష్, EDM రవి, అధికారులు ఉన్నారు.