'దివ్యాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి'
NGKL: జిల్లాలోని వికలాంగుల బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీచేయాలని సంఘం నేతలు కురుమయ్య, గౌతమ్‌లు కోరారు. శుక్రవారం కలెక్టరేట్ పరిపాలన అధికారి చంద్రశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. జిల్లా ఏర్పడినప్పటి నుంచి బ్యాక్‌లాగ్ ఉద్యోగాలు భర్తీచేయకపోవడంతో దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని పేర్కొన్నారు.