సర్వేయర్ల శిక్షణకు తేదీల ఖరారు

సర్వేయర్ల శిక్షణకు తేదీల ఖరారు

GDWL: 2వ విడతలో ఎంపికైన 130 మంది లైసెన్సుడ్ సర్వేయర్ అభ్యర్థులకు ఈనెల 18 నుంచి 50 రోజులు శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సంతోష్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. శిక్షణకు హాజరయ్యే అభ్యర్థులు 18న ఉ.10 గంటలకు గద్వాల పాత ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో హాజరు కావాలన్నారు. అర్హతకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలతో పాటు జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు.