సంగడిగుంట రహదారిపై ప్రజల ఇబ్బందులు

గుంటూరు: జిల్లాలోని సంగడిగుంట ప్రధాన రహదారిపై వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కల్వర్టు నిర్మాణం పూర్తయినప్పటికీ మున్సిపల్ అధికారులు రోడ్డుకు అడ్డంగా ఉన్న పెద్ద రాళ్లను తొలగించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 45 రోజులు గడిచినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.