అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

ప్రకాశం: మద్దిపాడు మండలం వెల్లంపల్లి బ్రిడ్జి కింద సోమవారం అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృత దేహం లభించడంతో స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడు గుంటూరుకు చెందిన వేముల రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. అనుమానస్పద మృతిపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.