నంద్యాల జేసీగా కార్తీక్
NDL: జిల్లా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కొల్లాబత్తుల కార్తీక్‌ను జేసీగా నియమించారు. ఈ మేరకు గురువారం ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన విష్ణు చరణ్‌ను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ డిప్యూటీ సెక్రటరీగా నియమించారు.