యూరియా యాప్ రద్దు చేయాలని అన్నారం రైతుల ధర్నా

యూరియా యాప్ రద్దు చేయాలని అన్నారం రైతుల ధర్నా

NLG: మిర్యాలగూడ మండలం అన్నారం గ్రామ పంచాయతీలోని బుధవారం సహకార సంఘం వద్ద రైతులు ధర్నాకు దిగారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన యూరియా యాప్ వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని, ఈ యాప్ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. యూరియా బుక్ చేసిన కొద్దిసేపటికే అది పక్కదారి పడుతోందని, ఈ యాప్ ద్వారా దళారులు లాభపడుతూ రైతులు నష్టపోతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.