ప్రశాంతంగా సాగిన ఇంటర్ పబ్లిక్ పరీక్షలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. గణితశాస్త్రం పేపర్–IIA, వృక్షశాస్త్రం పేపర్–II, రాజకీయ శాస్త్రం పేపర్–II పరీక్షలు జిల్లాలోని 37 కేంద్రాల్లో నిర్వహించగా, మొత్తం 8,805 మంది విద్యార్థులకు గాను 8,584 మంది హాజరయ్యారని చెప్పారు.