అడ్డాకులలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ల పంపిణీ
MBNR: అడ్డాకుల మండలం రాచాల జడ్పీ హైస్కూల్ పదవ తరగతి విద్యార్థులకు మాజీ విద్యార్థి మనోవర్ధన్ (2013-15 బ్యాచ్) ఎగ్జామ్ కిట్లను అందజేశారు. పరీక్షలకు సిద్ధమవుతున్న వారు ఆత్మవిశ్వాసంతో రాయాలని కోరుతూ పెన్లు, ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమాన్ని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.