సహారా ఇండియా ఖాతాదారులకు పేమెంట్ చేయాలి

సహారా ఇండియా ఖాతాదారులకు పేమెంట్ చేయాలి

ప్రకాశం: మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు సోమవారం మీకోసం కార్యక్రమంలో భాగంగా సహారా ఇండియా ఫీల్డ్ కార్యకర్తలకు న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాకు వినతి పత్రం అందజేశారు. సహారా ఇండియా ఖాతాదారులకు రావాల్సిన నగదు ఇంతవరకు రాలేదని దీంతో వారు ఫీల్డ్ కార్యకర్తల ఇండ్ల వద్దకు వచ్చి గొడవలు చేస్తున్నారని అన్నారు.