'దివ్యాంగులకు అండగా కూటమి ప్రభుత్వం'

BPT: చీరాలలో టీడీపీ కార్యాలయం ముందు విభిన్న ప్రతిభావంతులకు శుక్రవారం ట్రై సైకిళ్లు, చెవిటి మిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య పాల్గొని విభిన్న ప్రతిభావంతులకు సైకిళ్లను అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో దివ్యాంగులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.